జాతీయ నాటకోత్సవాలలో ఎంపికైన రంగస్థల కళారూపాలు

S.No. తేది ఇతివృత్తం
1 18-01-2017
బుధవారం
సా 8-00
పృద్వీ రాజ్ రాసో (పద్య నాటకం )
సంస్థ: Dr. రామన్ ఫౌండేషన్ (విజయవాడ)
రచన: పి.వి.ఎన్. కృష్ణ , దర్శకత్వం:పి.వి.ఎన్. కృష్ణ
దుర్మార్గులు, దేశ  ద్రోహులు, తీవ్రవాదుల పట్ల ఉదారంగా వ్యవహరించటం దేశానికి ఎంత ప్రమాదమో అనుభవ పూర్వకంగా వివరించిన చారిత్రక ఘట్టం. భారత దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య ఐక్యత యొక్క ఆవశ్యకతను చాటి చెప్పిన అద్భుత కావ్యం.
2 19-01-2017
గురువారం
సా 7-00
యాది  (సాంఘిక నాటిక )
సంస్థ: ఉషోదయ కళానికేతన్  (కట్రపాడు )
రచన: చెరుకూరి సాంబశివ రావు, దర్శకత్వం:చెరుకూరి సాంబశివ రావు
వర్షాలు సరిగా పడక, పంటలు పండక, అప్పుల పాలై రైతు ఆత్మ హత్య చేసుకుంటున్నాడు. సమస్య వచ్చినప్పుడు భయపడి పారిపోకూడదు. పోరాడాలి, గెలవాలి. ఆత్మ స్థైర్యంతో బ్రతికి రేపును పండిద్దాం అనే సందేశంతో ముగుస్తుంది నాటిక.
3 20-01-2017
శుక్ర వారం
సా 7-00
నల్లజర్ల రోడ్  (సాంఘిక నాటిక )
సంస్థ: సాగరి  (చిలకలూరి పేట )
రచన: Dr. కందిమళ్ళ సాంబశివ రావు , దర్శకత్వం:ఐ. రాజ్ కుమార్
నువ్వు నేను కలిస్తే మనం. మనం మనం కలిస్తే జనం, జనం జనం కలిస్తే ప్రభంజనం.  కానీ ఈ సమాజమంతా నువ్వు నేను అంటూ ఎవరికీ వారై పోతుంటే నేనుతో చేసిన సమాధి రాళ్ళలా బీడుగా మారిపోయిన్దనే సందేశాన్ని ఈ నాటిక ఇస్తుంది.
4 20-01-2017
శుక్ర వారం
సా 8-00
కృష్ణాంజనేయ యుద్ధం  (పద్య నాటకం )
సంస్థ: శ్రీ వాగ్దేవి కళా సమితి  (తెనాలి)
రచన: కీ.శే. తాండ్ర సుబ్రహ్మణ్యం , దర్శకత్వం:నాయుడు గోపి
తమకంటే గొప్పవారు లేరని, తమకేవ్వరూ సాటిరారని గర్వంతో విర్రవీగే వారికి ఏనాటికైనా గర్వభంగం కాక తప్పదనే సందేశంతో శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం పద్యనాటకం సాగుతుంది .
5 21-01-2017
శనివారం
సా 7-00
మధుర స్వప్నం (సాంఘిక నాటిక )
సంస్థ: గ్రామీణ కళాకారుల ఐక్య వేదిక  (వెనిగండ్ల )
రచన: ఏ. నర్సిరెడ్డి , దర్శకత్వం:ఏ. నర్సిరెడ్డి
ఒక స్వాతంత్ర్య సమరయోధుని ఆత్మ చదివి నిజాయితీ పరునిగా మారిన లంచగొండి తహసిల్దారు …సమాజ రుగ్మతలపై పోరాటానికి సిద్ధపడటం ఎలా జరిగిందో చూపడం “మధుర స్వప్నం” నాటిక ఇతివృత్తం.
6 21-01-2017
శనివారం
సా 8-00
అశ్శరభశరభ  (సాంఘిక నాటకం )
సంస్థ: మహేశ్వరీ ప్రసాద్ యంగ్ థియేటర్ ఆర్గనైసెషన్  (విజయవాడ)
రచన: N.S. నారాయణ బాబు , దర్శకత్వం:R. వాసుదేవ రావు
ఒళ్ళు కాలిపోయిన ఒక స్త్రీ తన జీవితాన్ని గుర్తుచేసుకోవటం, భర్తకి శిక్ష పడినట్లు ఊహించటం …
7 22-01-2017
ఆదివారం
సా 7-00
ఆగ్రహం  (సాంఘిక నాటిక )
సంస్థ: అరవింద ఆర్ట్స్  (తాడేపల్లి )
రచన: వల్లూరు శివ ప్రసాద్ , దర్శకత్వం:గంగోత్రి సాయి
దేశంలో స్త్రీలపై లైంగిక దాడులు జరుగుతూనే వున్నాయి.  ఎన్ని కటినమైన చట్టాలు చేసినా వీటిని నియంత్రించలేక పోతున్నాము. వారిలో మార్పు రావాలంటే ముందుగా కుటుంబం నుంచి వారిని వెలివెయ్యాలి.  ఇంటి నుంచే ఆగ్రహం ఆరంభం కావాలి.  సంస్కరణ వాదం ఇంటి నుంచే ప్రారంభిద్దామా ?
8 22-01-2017
ఆదివారం
సా 8-00
ప్రమీలార్జున పరిణయం  (పద్య నాటకం )
సంస్థ: TGV కళానికేతన్ (కర్నూల్)
రచన: పల్లేటి కులశేఖర్ , దర్శకత్వం:పత్తి ఓబులయ్య
ప్రమీల మహారాణి మలయాళ మహిళా సామ్రాజ్యానికి మహా రాణి …  పురుష ద్వేషి. ధర్మరాజు  అశ్వరక్షకునిగా ఆర్జునుడిని పంపుతాడు ప్రమీల అశ్వాన్ని బంధిస్తుంది  విడిపించడానికి వెళ్ళిన ఆర్జునుడిని ఓడిస్తుంది గర్వభంగమైన అర్జునుడు శ్రీ కృష్ణుడిని స్మరిస్తే వచ్చి వారి ఇరువురిని ఒప్పించి వివాహం చేయిస్తాడు.
9 23-01-2017
సోమవారం
సా 7-00
అనగననగ  (సాంఘిక నాటిక )
సంస్థ: యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్ (విజయవాడ)
రచన: పి. మృత్యుంజయ , దర్శకత్వం:R. వాసుదేవ
ప్రభుత్వాలు మారినా ప్రజల కస్టాలు మారవని పాలక వర్గాలలో మార్పు రావాలని ప్రభోదిస్తూ నడిచే నాటిక ఈ అనగననగ
10 23-01-2017
సోమవారం
సా 8-00
మహాజ్ఞాని మార్కండేయ (పద్య నాటకం )
సంస్థ: సావేర ఆర్ట్స్ (కడప)
రచన: పల్లేటి కులశేఖర్ , దర్శకత్వం:A. వెంకటయ్య
భక్తి కంటే జ్ఞానం గొప్ప. 16 సంవత్సరాల వయస్సులో ఆయువు తీరిన  మార్కండేయుడు తన జ్ఞానంతో ఈశ్వరుని కైవసం చేసుకొని పూర్ణాయుష్కుడవుతాడు
11 24-01-2017
మంగళవారం
సా 7-00
పితృ దేవోభవ  (సాంఘిక నాటిక )
సంస్థ: కృష్ణా ఆర్ట్స్ & కల్చరల్ అసోసియేషన్  (గుడివాడ )
రచన: వంగివరపు నవీన్ , దర్శకత్వం:మహమ్మద్ ఖాజావలి
తను కన్న వాళ్ళ సుఖ సంతోషాల కోసం తనని కన్న తండ్రిని కుటుంబానికి దూరం చేస్తే ఆ తండ్రికి పట్టిన దుర్గతికి దృశ్య రూపమే “పితృదేవోభవ” నాటిక
12 24-01-2017
మంగళ వారం
సా 8-00
స్వామి అయ్యప్ప (పద్య నాటకం )
సంస్థ: శ్రీ సర్వేశ్వరా నాట్యమండలి  (హైదరాబాద్)
రచన: పల్లేటి కులశేఖర్ , దర్శకత్వం:టి. బాబూరాజు
శివ భక్తులకు, విష్ణు భక్తులకు బేధం ఉండకూడదని విష్ణు ఈశ్వరులు కలిసి సృష్టించిన వాడే హరిహర సుతుడు ధర్మ శాస్త. మహిషిని సంహరించిన తరువాత ధర్మశాస్త ఉత్తరావతారమే అయ్యప్ప.
13 25-01-2017
బుధవారం
సా 7-00
అం అః కం కః  (సాంఘిక నాటిక )
సంస్థ: మురళీ కళా నిలయం  (హైదరాబాద్)
రచన: శ్రీ శంకర మంచి పార్ధసారధి , దర్శకత్వం:టి. సుందరం
కష్టపడకుండా కోట్లకు పడగలేత్తలనే దురాశతో అబద్ధాలు చెప్పి మోసాలు చేసి చివరకు బాకీదారుల్ని తట్టుకోలేక తను చనిపోయినట్లు నాటకమాడిన విశ్వపతికి అప్పులవాళ్ళు ఎలా బుద్ధి చెప్పారో హాస్యభరితంగా తెలియజెప్పే నాటిక .
14 25-01-2017
బుధవారం
సా 8-00
శంకర శాస్త్రి శపథం (సాంఘిక నాటకం )
సంస్థ: విజయభారతి సాంస్కృతిక సంక్షేమ సంఘం  (విశాఖపట్నం)
రచన: ఆర్. వి. చలం , దర్శకత్వం:వంకాయల సత్యనారాయణ మూర్తి
మూఢాచారాలతో పాటు సంప్రదాయాలను ముడి పెట్టరాదనే వాదనతో ముందుకొచ్చిన  ఒక సనాతన బ్రాహ్మణుని కథ:- నైతిక ధర్మాలను గౌరవించాలి
15 26-01-2017
గురువారం
సా 7-00
ఎవరిని ఎవరు క్షమించాలి (సాంఘిక నాటిక )
సంస్థ: KJR కల్చరల్స్  (హైదరాబాద్)
రచన: ఉదయ్ భాగవతుల , దర్శకత్వం:ఉదయ్ భాగవతుల
జీవితంలో ప్రతి మనిషి తప్పులు చేస్తూ ఉంటాడు. అన్ని మతాలలోకి పాతది గొప్పది పురాతనమైనది మనవత్వం అనే ఒక మతముంది. ఆ మతంలో అందరిని అందరూ క్షమించుకోవాలనే వృత్తం తో ఈ నాటిక ఎవరిని ఎవరు క్షమించాలి.
16 26-01-2017
గురువారం
సా 8-00
వినాయక విజయం  (పద్య నాటకం )
సంస్థ: నవక్రాంతి కల్చరల్ అసోసియేషన్  (హైదరాబాద్)
రచన: డా. జంద్యాల సుబ్బలక్ష్మి , దర్శకత్వం:యం. అర్జున రావు
లోక కంటుడైన భీషణాసురునకు వినాయకుని రక్షణ ఉన్నంత వరకు అతడిని జయించడం అసాధ్యమని గ్రహించిన శ్రీ కృష్ణుడు మోహిని రూపం దాల్చి భీషణాసురుని ప్రేమ మత్తులో నింపి యాగాశ్వం వెంట వచ్చిన అర్జునుని చేతిలో భీష్మణాసురుని  హతముగావిస్తాడు.  ఎంతటి  ప్రతిభావంతులైనా దుష్టసాంగత్యంతో వ్యసనాలకు బానిసలైతే వారికి అధఃపతనం తప్పదు.
17 27-01-2017
శుక్రవారం
సా 7-00
నిశ్శబ్ద సంకేతం  (సాంఘిక నాటిక )
సంస్థ: తుళ్ళూరు కళా పరిషత్  (తుళ్ళూరు)
రచన: ఎం. మధుసూదన రావు , దర్శకత్వం:ఎం. మధుసూదన రావు
గతం వర్తమానాల సంఘర్షణలో నలుగుతున్న జీవితాలకు దర్పణం, బాధ్యతలు సిద్ధాంతాల సమరంలో సమిధలవుతున్న కుటుంబాల దృశ్య రూపమే నిశ్శబ్ద సంకేతం.
18 27-01-2017
శుక్రవారం
సా 8-00
జారుడు మెట్లు  (సాంఘిక నాటకం )
సంస్థ: కళాంజలి – ప్రగతి నగర్  (హైదరాబాద్ )
రచన: కంచర్ల సూర్య ప్రకాష్ , దర్శకత్వం:కొల్లా రాధాకృష్ణ
మనకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాజకీయ నాయకులు తెల్లదొరల చెప్పులో కాళ్ళు పెట్టి నడుస్తున్నారు.  ప్రజా సేవ మర్చిపోయి తమ సేవ చేసుకుంటున్న రాజకీయ నాయకుల దిగజారుడు తనాన్ని చెప్పే నాటకం జారుడు మెట్లు.
19 28-01-2017
శనివారం
సా 7-00
కృష్ణ బిలం (సాంఘిక నాటిక )
సంస్థ: కళాంజలి  (హైదారాబాద్ )
రచన: భాస్కర్ చంద్ర , దర్శకత్వం:కొల్లా రాధాకృష్ణ
మన పిల్లల కోసం పస్తులుంటాం. వాళ్ళ  అవసరాల కోసం పుస్తేలమ్ముకుంటాం,  మన పిల్లలు పెద్దవాళ్ళయ్యాక మీ దారి మీరు చూసుకోమని రోడ్డున పడేయడం మన రక్తంలో లేదని తెలియ చెప్పే నాటిక కృష్ణ బిలం
20 28-01-2017
శనివారం
సా 8-00
శ్రీ రాఘవం  (పద్య నాటకం )
సంస్థ: జయ కళానికేతన్ (విశాఖ పట్నం)
రచన: Dr. CH. శ్రీనివాసరావు , దర్శకత్వం:చలసాని కృష్ణ ప్రసాద్
మనిషే దేవుడు అని చెప్పిన మహనీయుడు రామచంద్రుడు. ఆయన మహాభినిష్క్రమణ ఘట్టం ఈ నాటక ఇతివృత్తం.  శ్రీ రాముని జీవితపు తుదిదశ, ఆదర్శనీయమైన ఆయన నడత, నిబద్ధమైన ఆయన మనుగడలే ‘శ్రీ రాఘవం’  సారాంశం.
21 29-01-2017
ఆదివారం
సా 7-00
బైపాస్ (సాంఘిక నాటిక )
సంస్థ: శ్రీ సాయి ఆర్ట్స్  (కొలకలూరు)
రచన: ఆకెళ్ళ శివ ప్రసాద్ , దర్శకత్వం:గోపరాజు విజయ్
మనిషి డబ్బు సంపాదించే అవకాశం ఎప్పుడొస్తుందా అని కాదు ఎదురు చూడాల్సింది.  ఎదుటివాడికి సాయం చేసే అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూడాలి.  సాయం అందుకోవడానికి ఎన్నో చేతులు ఎదురుచూస్తున్నాయ్. మనకి మాత్రం చేతులు రావటం లేదు. ఇది బైపాస్ నాటిక ఉద్దేశం.
22 29-01-2017
ఆదివారం
సా 8-00
మరణం శరణం గచ్చామి (సాంఘిక నాటకం )
సంస్థ: సాగరి (చిలకలూరి పేట)
రచన: డా. కందిమళ్ళ సాంబశివ రావు , దర్శకత్వం:ఐ. రాజ్ కుమార్
ఆశయం కన్నా ఆచరణ గొప్పది. సిద్దాంతం కన్నా మానత్వంతో కూడిన నిజం ఇంకా గొప్పది. జీవితంలో మనం నేర్చుకునే  విషయాల కంటే జీవితం మనకు నేర్పిన అనుభవాలు, పాఠాలు ఇంకా గొప్పవనే సందేశంతో ఈ నాటకం రచించబడింది.
23 30-01-2017
సోమవారం
సా 7-00
దావాగ్ని  (సాంఘిక నాటిక )
సంస్థ: పోలార్ ఆర్ట్స్  (విశాఖపట్నం )
రచన: బి.వి. రమణారావు , దర్శకత్వం:బి. వేణు గోపాలరావు
యువతను కట్టు బానిసలను చేసి బలహీన పరిచేందుకు విదేశీయులు చేసే కుతంత్రంలో ఒక విద్యార్ధి బయటపడి తోటి స్నేహితులను కాపాడటానికి చేసే ప్రయత్నంలో మన దేశ విలువలు సాంప్రదాయాలను చాటి చెప్పే ప్రయత్నమే దావాగ్ని
24 30-01-2017
సోమవారం
సా 8-00
మినిస్టర్ (సాంఘిక నాటకం )
సంస్థ: మీడియా క్రియేషన్స్  (హైదరాబాద్ )
రచన: Dr. విజై భాస్కర్ , దర్శకత్వం:డా. కోట
ప్రజాప్రతినిధిగా ఎన్నికై మంత్రిగా గద్దెనెక్కి ఎడాపెడా సంపాదించే రాజకీయ వేత్త మనోపరివర్తనను పలు మలుపులతో చూపించే నాటకం మినిస్టర్.  నమ్మిన సిద్దాంతం కోసం జీవన ప్రస్థానం సాగించి నీతిమంతుడైన రాజకీయ నాయకుని ఘటనల సమాహారమే మినిస్టర్ నాటకం
25 31-01-2017
మంగళ వారం
సా 7-00
గడి (సాంఘిక నాటిక )
సంస్థ: SNM క్లబ్  (వరంగల్ )
రచన: ఆకెళ్ళ , దర్శకత్వం:బి.యం. రెడ్డి
ద్రౌపతిపై నిండు సభలో అవమానం జరిగితే శ్రీ కృష్ణుడు వచ్చి ఆదుకున్నాడు. నిజాం పరిపానలో తెలంగాణా దొరలు నివసించే ‘గడి’ అనే భవనాలలో ఆడదానిపై జరిగే అత్యాచారాలను ఏ దేవుడూ ఆదుకోలేదు. స్వాతంత్ర్యం వచ్చాక “నిర్భయ”లు నిత్యం జరుగుతూనే వున్నాయ్. ఆదుకునేది ఎవరు….?
26 31-01-2017
మంగళ వారం
సా 8-00
ధర్మ క్షేత్రం  (గద్య నాటకం )
సంస్థ: KV మెమోరియల్ ఆర్ట్స్ అసోసియేషన్  (విశాఖపట్నం )
రచన: డి.ఎస్.ప్రసాద రెడ్డి , దర్శకత్వం:పి. శివ ప్రసాద్
కర్తవ్య నిర్వహణలో రక్త సంబంధాలకు తావులేదని వ్యక్తిగత ప్రేమలకన్నా దేశభక్తే ముఖ్యమని చాటి చెప్తుంది ఈ నాటకం.
27 1/2/2017
బుధవారం
సా 7-00
వికసిత మందారాలు ( గద్య నాటిక) (బాలల నాటిక)
సంస్థ: శశికళా నిలయం  (చెరుకుపల్లి )
రచన: సోమాశి శ్రీనివాస మూర్తి , దర్శకత్వం:సోమాశి శశి కిరణ్
పనివాడు చంద్రాన్ని చదివించాలని ఆకాంక్షతో వున్న సూర్యం అతన్ని కొడతాడు.  చంద్రం తండ్రి నారాయణ మరెక్కడైనా చంద్రాన్ని పెడతాననే సరికి ఓ చిన్న నాటకమాడి నారాయణ దంపతులలో పరివర్తన తీసుకొస్తాడు సూర్యం.  బడికి వెళ్ళవలసిన బాల్యంలో పనికి పంపడం నేరమనే సందేశం ఈ నాటిక
28 1/2/2017
బుధవారం
సా 8-00
రుక్మిణీ కళ్యాణం  (సంగీత నృత్య రూపకం )
సంస్థ: శ్రీ సాయి మంజీరా కూచిపూడి ఆర్ట్ అకాడెమీ  (గుంటూరు )
రచన: శ్రీ కాజా వెంకట సుబ్రహ్మణ్యం , దర్శకత్వం:శ్రీ కాజా వెంకట సుబ్రహ్మణ్యం
పోతన భాగవతంలోని రిక్మిణీ ఇతివృత్తానికి కూర్చబడినది.  రుక్మిణీ కళ్యాణం అనేది ఈ నృత్య రూపకం
29 2/2/2017
గురువారం
సా 7-00
మైత్రి విజయం (పద్య నాటిక) (బాలల నాటిక)
సంస్థ: శశికళా నిలయం  (చెరుకుపల్లి )
రచన: సోమాశి శ్రీనివాస మూర్తి , దర్శకత్వం:సోమాశి ఛత్రపతి సాయి కౌశిక్
భక్తి కొల్లగొట్టలేని సంపద, శివ మైత్రియే సంపూర్ణ విజయమని తెలియజేస్తుంది ఈ నాటిక
30 2/2/2017
గురువారం
సా 7-45
గంగిరెద్దు  (సంగీత నృత్య రూపకం )
సంస్థ: దాక్షిణాత్య ఆర్ట్స్ అకాడెమీ  (హైదరాబాద్ )
రచన: డా. కోట్ల హనుమంత రావు , దర్శకత్వం:డా. అనితా రావు
 గురు-శిష్య ప్రాశస్త్యాన్ని తెలియపరుస్తూ గురువు గొప్పదనాన్ని నేటి తరానికి తెలియచేసే సంగీత నృత్య రూపకమే గంగిరెద్దు.
31 2/2/2017
గురువారం
సా 9-15
పాపం చిట్టి గువ్వలు  (యువ నాటిక )
సంస్థ: నటరాజ నృత్య కళాశాల  (నరసరావు పేట )
రచన: చౌడం శ్రీనివాస్ , దర్శకత్వం:గుంటూరి త్రిపుర సుందరి
 విద్యా వ్యవస్థలో యంత్రాలుగా మారి విద్యార్ధులు పడుతున్న మానసిక వ్యధ
32 3/2/2017
శుక్రవారం
సా 7-00
ఊరికొక్కరు (గద్య నాటిక) (బాలల నాటిక)
సంస్థ: అమన్ వేదిక రైన్ బో హోం సోన్చ్ థియేటర్ గ్రూప్  (సికింద్రాబాద్ )
రచన: డా. రాయల హరిశ్చంద్ర , దర్శకత్వం:డా. రాయల హరిశ్చంద్ర
ఆడపిల్లను చదివించు, సమాజాన్ని వెలిగించు.  బాలికల భవితకు బంగారు బాట చూపించు అనే నినాదంతో సమకాలీన పరిస్థితులను తట్టుకొని ప్రోత్సాహంతో ఒక ఆడపిల్ల ఎలా పైకి వచ్చింది అనే అంశాన్ని కొత్తగా చూపించాలని చేసిన ప్రయత్నమే ఈ బాలల నాటిక
33 3/2/2017
శుక్రవారం
సా 8-00
తెలుగు ప్రశస్తి (సంగీత నృత్య రూపకం )
సంస్థ: శ్రీ కె.ఆర్.కె.ఎం. మెమోరియల్ అకాడెమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్  (హైదరాబాద్ )
రచన: శ్రీ దండిబొట్ల వైకుంఠ నారాయణ మూర్తి , దర్శకత్వం:కోకా విజయ లక్ష్మి
సుమారు 3000 సం.లో తెలుగు భాష పాచీనతను ప్రాచీన నాణాల, శాసనాల, పురాతత్వ ఆధారాల సహితంగా నిరూపిస్తూ కూచిపూడి ప్రక్రియలో ప్రదర్శిస్తున్న విశిష్ట సంగీత నృత్య రూపకం “తెలుగు ప్రశస్తి”
34 4/2/2017
శనివారం
సా 7-00
బంగారు కొండ (సాంఘిక నాటిక)  (బాలల నాటిక)
సంస్థ: అమరావతి సొసైటీ ఆఫ్ కల్చరల్ అసోసియేషన్  (నందలూరు )
రచన: బి.ఎం. బాషా , దర్శకత్వం:బి. సాయి సందీప్
మారుతున్న కాలంతో కుటుంబ వ్యవస్థలో కలుగుతున్న మార్పులు, ఆ మార్పులను అందిపుచ్చుకోవటానికి పెద్దల ప్రయాసలు, పిల్లల అగచాట్లతో పాటు ఒక బాలుని ద్వారా ఇల్లు ఎలా చక్కబడింది ఈ బాలల నాటిక చూపుతుంది
35 4/2/2017
శనివారం
సా 8-00
నర్తనశాల (కీచక వధ) ) (సంగీత నృత్య రూపకం )
సంస్థ: కూచిపూడి అకాడెమీ  (కూచిపూడి  – కృష్ణా జిల్లా )
రచన: డా. వేదాంతం రామలింగ శాస్త్రి , దర్శకత్వం:డా. వేదాంతం రామలింగ శాస్త్రి
ఇది మహా భారత విరాట పర్వం లోని కీచకవధ ఘట్టమునకు సంబంధితము- ఎంతటి ఘనుడైనా పరస్త్రీ లోలుడైతే పతనము తప్పదు అనే నీతి బోధ గాధ ఇది
36 5-2-2017
ఆదివారం
సా 7-00
నమోనమః  (యువ నాటిక )
సంస్థ: స్నేహ ఆర్ట్స్  (చంద్రమాం పల్లి – పెద్దాపురం మండలం )
రచన: శ్రీ మాడభూషి దివాకర బాబు , దర్శకత్వం:పిఠాపురం బాబూరావు
అందరికీ అందరికన్నా రైతే ముఖ్యం అని చాటిచెప్పే యువ నాటిక
37 5-2-2017
ఆదివారం
సా 8-00
శ్రీనివాస కళ్యాణం  (సంగీత నృత్య రూపకం )
సంస్థ: చందు డాన్స్ అకాడమీ  (ఒంగోలు )
రచన: టి. చందు , దర్శకత్వం:టి. చందు
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుని దివ్య కళ్యాణము జరపడమే శ్రీనివాస కళ్యాణం.  విష్ణుమూర్తి వైకుంఠం నుండి కలియుగ ప్రత్యాక్ష దైవమైన శ్రీనివాసుని దివ్య కళ్యాణము జరపడమే  శ్రీ శ్రీనివాస కళ్యాణం. విష్ణు మూర్తి వైకుంఠం నుండి కలియుగ వైకుంఠమైన తిరుమల చేరుటకు మధ్య జరిగిన సంఘటనల సంక్షిప్త దృశ్యరూపమే …
38 6/2/2017
సోమవారం
సా 7-00
కాంట్రవర్సీ  (యువ నాటిక )
సంస్థ: న్యూ మోడరన్ థియేటర్స్ (విజయవాడ)
రచన: ఎం. ఎస్. చౌదరి , దర్శకత్వం:ఎం. ఎస్. చౌదరి
స్మశాన సమాజంలో హక్కుల అవశేషాల కోసం వెతుకులాట
39 6/2/2017
సోమవారం
సా 8-00
గోదాదేవి కళ్యాణం  (సంగీత నృత్య రూపకం )
సంస్థ: మాతృశ్రీ రాజేశ్వరి నృత్య కళాశాల  (ఒంగోలు )
రచన: జియర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ , దర్శకత్వం:హైమావతి
శ్రీ విల్లి పుత్తూరు గ్రామంలో విష్ణుచిత్తుడనే పరమ భక్తునకు భూదేవి అంశగా గోదాదేవి తులసివనంలో లభిస్తుంది ఆమె చిన్న నాటి నుండి శ్రీరంగని తన భర్తగా అనుకోని ఆరాధించి, సేవించి శ్రీ రంగ నాధుని పరిణయమాడే దివ్య గాధ
40 7-02-2017
మంగళ వారం
సా 7-00
రుక్మిణీ కృష్ణ  (సంగీత నృత్య రూపకం )
సంస్థ: శ్రీ నళినీ ప్రియ కూచిపూడి నృత్య నికేతన్  (ఒంగోలు )
రచన: డా. వేదాంతం రామలింగ శాస్త్రి , దర్శకత్వం:శ్రీమతి ఎస్.వి. శివ కుమారి
ఇది శ్రీ మద్భాగవతాంతర్గత రుక్మిణీ కళ్యాణ ఘట్టము.  శాంతియే మానవ జీవితాలకు సుఖసంతోషదాయకము. ఆ శాంతి భాగవత్కళ్యాణ గాధలతో కల్గుతుంది.  ఈ శాంతి  మా కాంక్ష.
41 7-02-2017
మంగళ వారం
సా 8-00
సుజలాం సుఫలాం (సాంఘిక నాటకం )
సంస్థ: న్యూ మోడరన్ థియేటర్స్ (విజయవాడ)
రచన: యం.ఎస్. చౌదరి , దర్శకత్వం:యం.ఎస్. చౌదరి
ఆ ఈ నాటి  నీటి యుద్ధం
42 08-02-2017
బుధవారం
సా 7-00
జగమంత కుటుంబం  (సాంఘిక నాటకం )
సంస్థ: భానూదయ  (ఒంగోలు )
రచన: K.V. వెంకట్, దర్శకత్వం:K.V. వెంకట్
60సం. క్రితం రైతు ఒక రాజుగా వెలిగాడు.  కానీ ఇప్పటి పరిస్థితి అలా లేదు.  రసాయనాలతో పంటలు పండించి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.  కానీ రైతు కుటుంబానికే కాదు దేశానికి కూడా చాలా అవసరం. కాబట్టి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించి సమస్యలను చక్క దిద్దుకొమ్మని చెప్పే సందేశాత్మక నాటకమే “జగమంత కుటుంబం”
43 9/2/2017
గురువారం
సా 9-00
కృష్ణవేణి చరితం  (సంగీత నృత్య రూపకం )
సంస్థ: చందు డాన్స్ అకాడమీ  (ఒంగోలు )
రచన: నేమాని సీతారామ మూర్తి , దర్శకత్వం:టి. చందు
కృష్ణానది పుట్టుక, పరివాహక ప్రదేశం, నాగరికతలు, చరిత్ర, కళలు మొదలైన అన్ని అంశాల సమాహారమే కృష్ణవేణి చరితం

An Open-content National Arts Development Mission